చిన్న కొడుకుతో చిల్ అవుతున్న బండి సంజయ్.. ఎక్స్ లో పోస్ట్..!

-

దాదాపు రెండు నెలల ప్రచారంలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు రిలాక్స్ మూడ్లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిపోవడంతో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని, విహార యాత్రలకు వెళ్ళాలని నాయకులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని కేటాయించడం పైన నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన చిన్న కొడుకుతో చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు.

మారథాన్ లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైమ్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. తన చిన్న కొడుకుని పట్టణంలో స్కూటీపై సరదాగా తిప్పారు. తర్వాత ఐక్రీం షాప్లో తన కొడుకుతో కలిసి ఐక్రీం తింటున్న ఫోటోలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు సాధారణ వ్యక్తిల స్కూటీపై తన కొడుకుని ఎక్కించుకుని తిప్పున్నారని నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా స్కూటీ నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలని నెటిజన్లు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version