రేవంత్ రెడ్డి రియల్‌ ఫైటర్ – బండి సంజయ్‌

-

రేవంత్ రెడ్డి రియల్‌ ఫైటర్ అన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ్‌. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని బిజెపి ఎంపీ బండి సంజయ్ కొనియాడారు. ‘రేవంత్ ఫైటర్. కెసిఆర్ కు నేను, రేవంత్ రెడ్డి టార్గెట్.

bandi-sanjay on revanthreddy

మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకే తెలుసు. దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు. ఆ మూర్ఖత్వపు ప్రభుత్వం పోయినందుకు హ్యాపీ. గత ప్రెస్ మీట్లలో కేటీఆర్ ఎలా ప్రవర్తించేవారు. ఇప్పుడు విలేకరులకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నవ్వుతూ నటిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం సంతోషకరంగా ఉందన్నారు బండి సంజయ్‌. బీజేపీ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు.. అవినీతి పాలనను ప్రజలు అంతమొందించారని వివరించారు. బండి సంజయ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఓడగొట్టారు.. గెలిచినా ఓడినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు బండి సంజయ్‌. దురదృష్టవశాత్తు కరీంనగర్ లో ముస్లింలు ఒకటయ్యారు. వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసినందుకు, ముస్లింల ఇండ్లు కూల్చిన వాళ్లకు సపోర్ట్ చేసినందుకు ఎంఐఎం పార్టీ వాళ్లకు సిగ్గు, లజ్జ ఉండాలని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version