తెలంగాణ ప్రభుత్వ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రగతి, సంక్షేమం, సుప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

మొత్తం బడ్జెట్ – తెలంగాణ రాష్ట్రం 2025-26:
•మొత్తం బడ్జెట్: రూ. 3,04,965 కోట్లు
•రెవెన్యూ వ్యయం: రూ. 2,26,982 కోట్లు
•మూలధన వ్యయం: రూ. 36,504 కోట్లు .
తలసరి ఆదాయం:
•తెలంగాణ తలసరి ఆదాయం (2024-25): రూ. 3,79,751
•వృద్ధి రేటు: 9.6%
•దేశ తలసరి ఆదాయం (2024-25): రూ. 2,05,579
•తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే సుమారు 1.8 రెట్లు ఎక్కువ .
ముఖ్యమైన రంగాలకు కేటాయించిన నిధులు:
•రైతు భరోసా పథకం: రూ. 18,000 కోట్లు
•వ్యవసాయ శాఖ: రూ. 24,439 కోట్లు
•పశుసంవర్ధక శాఖ: రూ. 1,674 కోట్లు
•పౌర సరఫరాల శాఖ: రూ. 5,734 కోట్లు
•విద్యాశాఖ: రూ. 23,108 కోట్లు
•క్రీడాశాఖ: రూ. 465 కోట్లు 
•పరిశ్రమల శాఖ: రూ. 3,527 కోట్లు 
•రోడ్లు మరియు భవనాల శాఖ: రూ. 5,907 కోట్లు 
•మునిసిపల్ ప్రణాళిక మరియు పట్టణాభివృద్ధి శాఖ: రూ. 17,677 కోట్లు 
•పర్యావరణ మరియు అడవుల శాఖ: రూ. 1,023 కోట్లు 
•శెడ్యూల్డ్ కులాల సంక్షేమం: రూ. 40,232 కోట్లు
•శెడ్యూల్డ్ తెగల సంక్షేమం: రూ. 17,169 కోట్లు 
•కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ: రూ. 900 కోట్లు 
•మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ: రూ. 2,862 కోట్లు