ఆరు గ్యారెంటీల అమలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత : భట్టి విక్రమార్క

-

ఆరు గ్యారెంటీల అమలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఆరు హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక వేగంగా సాగుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీకి అవసరమై నిధులు ఏర్పాటు చేస్తున్నామని వివరిం చారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, త్వరలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు.

సత్వర పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వ పథకాలు గొప్ప.. అమలు దిబ్బ. గత ప్రభుత్వ అప్పులు అభివృద్ధికి అడ్డంకి కాదు. అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తాం. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్థిక కష్టాలు. దేశ జీడీపీ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 2.4 శాతం ఎక్కువ. సంతులిత వృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం. ఆర్భాటాలు, ఆకర్షణలకు దూరంగా ప్రభుత్వం ఉంటుంది. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version