మనిషికి ఆధార్ తరహాలో భూదార్ తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. 33 జిల్లాల నుంచి అభిప్రాయాలను తీసుకొని.. 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాలను పరిశీలించిన తరువాత కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ధరణి పోర్టల్ ను అంతా రహస్యంగానే ఉంచారు. ధరణీ పోర్టల్ లో మూడేళ్లలో లక్షలాది సమస్యలు తలెత్తాయి. ఒక్క కలం పోటుతో వ్యవస్థను ఆగం చేశారని తెలిపారు.
భూ భారతిని NIC కి అప్పగించాం. భూ భారతిలో భూమికి సంబంధించిన అన్ని వివరాలుంటాయని తెలిపారు. సమస్యలు తీర్చాలని ధరణీతోనే కొత్త సమస్యలు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం.. ధరణీని బంగాళఖాతంలో పడేశామని తెలిపారు. ROR చట్టం-2020 ని సవరణలు చేసి భూ భారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు మంత్రి పొంగులేటి. పార్ట్ బీ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.