కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ కు చుక్కెదురు అయింది. పదేళ్లుగా అధికారం లేక ఆర్థిక కష్టాల్లో ఉన్న హస్తం పార్టీకి తెలంగాణలో గెలుపుతో, తెలంగాణను కేంద్రంగా చేసుకుని ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటుంది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆర్థిక వనరుల సేకరణ పనులు అప్పగించారట.
దానంకు సంబంధించిన రెండు హెచ్ఎండీఏ ఫైళ్లను క్లియర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో ముడుపులు ఢిల్లీకి పంపడంతో పాటు తాను ఎంపీగా పోటీ చేసేందుకు అయ్యే ఖర్చు అంతా భరించాల్సి ఉండగా, ఈ ఒప్పందాన్ని దానం తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్‌ను తీసేసి ఆ స్థానాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది.