బండి సంజయ్ అధ్యక్ష పదవి మార్పుపై కేంద్ర బిజెపి కీలక ప్రకటన చేసింది. తెలంగాణ BJP అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ట్ర బిజెపి ఇన్చార్జ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ ను మార్చేది లేదని అధిష్టానం స్పష్టత ఇచ్చిందని చెప్పారు.
కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలక బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేశారు. అమిత్ షా పర్యటనపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.