BRS పార్టీలోకి బిజెపి నేత వి6 వివేక్ ?

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7వ తేదీ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా సమాచారం అందుతుంది.

BJP leader V6 Vivek into BRS party

ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి పార్టీ లో టికెట్లు రానివారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇక కొంతమంది బీజేపీ నేతలు అధికార పార్టీలోకి వస్తున్నారు. ఈ తరుణంలోనే.. భారత జనతా పార్టీ నేత అయిన వి6 వివేక్ వెంకటస్వామి త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ వి6 వివేక్ కు ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో వి6 వివేక్ మళ్లీ గులాబీ కండువా కప్పుకో నున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version