నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ..కాంగ్రెస్‌ కీలక నిర్ణయం

-

నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ ఈ నెల 13న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సభ నుంచి హైదరాబాద్‌ వెళ్లేముందు నల్లగొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చురకలు అంటించారు. నల్లగొండ లో బీఆర్‌ఎస్‌ పార్టీ బహిగంగ నేపథ్యంలో కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుందన్నారు.

congress brs

SLBC ఎన్నికల అస్త్రం గానే కేసీఆర్..చూసారు…SLBC నీ నిర్లక్ష్యం చేసి, నల్లగొండ జిల్లాను ఎండబెట్టాడని ఫైర్‌ అయ్యారు.సీఎం జగన్ తో కుమ్మక్కై కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసారని… KRMB గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీష్ రావు కు లేదని ఆగ్రహించారు. బడ్జెట్ లో సంక్షేమం, విద్యా, వైద్యం కు పెద్దపీట వేసామని.. గత ప్రభుత్వం అప్పులను మిగిల్చి వెళ్తే… బడ్జెట్ లో 13శాతం అప్పుల చెల్లింపులకే పోతుందన్నారు. గత ప్రభుత్వం అంకెల, మాటల గారడితో కాలం వెల్లదీసింది..రెగులర్ బడ్జెట్ చాలా గొప్పగా ఉంటుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version