ఇవాళ అసెంబ్లీకి ఎండిన పొలాలతో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి, ఆందోళనకు దిగారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ నినాదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల్లో ధైర్యం నింపడానికి బిఆర్ఎస్ ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పాటలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎండిన వారి గడ్డితో అసెంబ్లీ కి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ పై కోపంతో మెడి గడ్డని ఎండబెడుతున్నారు.. అక్కడ ఇసుక దందా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు మీద ప్రేమతో కిందికి నీళ్ళు విడిచింది ప్రభుత్వం..ఇక్కడ తెలంగాణ రైతుల పంటకు ఎండబెట్టారని ఆగ్రహించారు. ఎండిన పంటలకు ఎకరానికి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎండిన పొలాలతో BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు
రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం
అంటూ నినాదాలు pic.twitter.com/zPeauOdxZM— Telugu Scribe (@TeluguScribe) March 19, 2025