BREAKING: హైదరాబాద్ లో దారుణ హత్య చోటు చేససుకుంది. టీచర్ పై కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో మర్డర్ జరిగింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై కత్తితో దాడి హత్య జరిగింది. హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు.
గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ నెలకొంది. వెంకటరమణ పై గణేష్ కటింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఇక రక్తపు మడుగులో వెంకటరమణ స్పాట్ లో డెత్ అయ్యాడు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.