నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

-

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ఖర్చుల కోసం గాను సిఎం కేసీఆర్ రూ. 2 కోట్లను ప్రకటించారు. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.

నిన్న కేబినేట్‌ సమావేశం జరిగిన నేపథ్యంలో నిఖత్‌ జరీన్‌ కు సాయం చేశారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా కేబినెట్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.కులవృత్తులను బలోపేతం చేసేందుకు లక్ష ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమల్లో ఉంటాయో, వారికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. అలాగే.. వీఆర్‌ఏ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తూ కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version