పద్మ శ్రీ తిమ్మక్కకు సీఎం కేసీఆర్ సన్మానం

-

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు,ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తోడ్కొని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్క గారిని, సమావేశం లో పాల్గొన్న మంత్రులు,ఉన్న ప్రజాప్రతినిధుల కు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క గారు సీఎం కు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క గారు పడుతున్న తపన,సమావేశం లో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.

పద్మశ్రీ తిమ్మక్క గారి వివరాలు :
పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, మొక్కలే పిల్లలు గా, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పనిచేస్తున్నారు.
తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version