గత 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేంటి : కేసీఆర్ 

-

సూర్యపేట జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించారు. నూతన మెడికల్ కాలేజీని, కలెక్టర్ భవనాన్ని, మార్కెట్ భవనంతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంబించారు సీఎం కేసీఆర్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సూర్యపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీ రూ.25 కోట్లు..  సూర్యపేట అభివృద్దికి రూ.50 కోట్లు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాను. కాంగ్రెస్, బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నాయి. భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీ ఇవ్వాలనే ఆలోచన వీరికి వచ్చిందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తన జన్మల రూ.1000 పెన్షన్ ఇవ్వలేదు. రూ. ఛతీస్ గడ్, రాజస్థాన్  లో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది.. అక్కడ రూ.4వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సూర్యపేట నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించారు కేసీఆర్. ఒకడు మోటార్లకు మీటర్లు అంటాడు. మరొకడు 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటాడు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అంటుంది. ధరణి తీసేస్తే మళ్లీ పాత కథ వస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version