తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐఏఎస్ నిబంధనల సవరణను పై సీఎం కేసీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఐఏఎస్ నిబంధనల సవరణను వెనక్కి తీసుకోవాలని లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ కోరారు. ఐఏఎస్ నిబంధనల సరవణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఐఏఎస్ నిబంధనలు పాత పద్దతిలోనే ఉండాలని లేఖలో సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ కొత్త సవరణల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతాయని తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరించే సవరణలను తీసుకురావద్దని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాధిస్తున్న ఐఏఎస్ నిబంధనల సవరణలను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కాగ గత కొద్ది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి వరుసగా లేఖలు రాస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇలా కేంద్ర మంత్రులకు, ప్రధాన మంత్రికి లేఖలు రాస్తున్నారు. సీఎం కేసీఆర్ గతంలో కూడా ఒక సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.