ఇవాళ ఖైరతాబాద్ గణేష్ కు మొదటి పూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి !

-

వినాయక చవితి సందర్భంగా ఇవాళ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకొని మొదటి పూజను నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవ్వాళ గల్లి గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు భక్తులు. హైదరాబాద్‌ నగరంలో ఎన్ని బొజ్జ గణపయ్యలు ఉన్నా… ఖైరతాబాద్ బడా గణేష్ ఎంతో ప్రత్యేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి 70 అడుగుల మట్టి వినాయకుడు… సప్త ముఖ మహా గణపతి రూపంలో దర్శనం ఇస్తున్నారు.

CM Revanth Reddy will visit Khairatabad Ganesh today and perform the first puja

ఇవ్వాల్టి నుంచి ఈనెల 17 వ తేదీ వరకు సాగే మహాగణపతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఇవాళ పద్మశాలి సంఘం తరపున బడా గణేష్ కు జంజం, కండువా సమర్పించనున్నారు. ఇక ఇవాళ సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకొని మొదటి పూజను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ విష్ణు దేవ్ శర్మ హాజరయ్యే అవకాశం ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version