R.S.ప్రవీణ్ కుమార్ కి సీఎం రేవంత్ రెడ్డి రిప్లై

-

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ రిప్లై ఇచ్చారు. ఒక విద్యాధికులుగా, పొలిటీషియన్ గా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని.. ప్రజా ప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఈ సూచనలను నిశితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేసారు. గురుకుల టీచర్ల రిక్రూట్ మెంట్ అంశానికి సంబంధించి ఆర్ఎస్పీ ఇటీవలే ట్వీట్ లో సీఎం కు చేసిన సలహాలకు రిప్లై ఇచ్చారు. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో.. వారి భవిష్యత్ మీద గత ప్రభుత్వం ఏవిధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూశామంటూ ఆర్ఎస్పీకి ఇచ్చిన ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version