తెలంగాణ అంటే పోరాటం.. రాష్ట్ర చిహ్నంలో అది ప్రతిబింబించాలి : సీఎం రేవంత్

-

చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి .. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమేనని తెలిపారు. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం అని.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలని వ్యాఖ్యానించారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.

అదే విధంగా… ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా TG ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ తెలిపారు. ఉద్యమ సమయంలో TG నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారని.. యువత తమ గుండెలపై TG అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారని చెప్పారు. వారి ఆకాంక్షల మేరకు TS స్థానంలో TG ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version