మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ!.. నీటిపారుదల శాఖ నిర్ణయం

-

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. బ్యారేజీ వైఫల్యాలు అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది.

బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్‌, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రామరాజు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) మురళీధర్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఓఅండ్‌ఎం) నాగేందర్‌రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేయనుంది. రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేసి కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version