తెలంగాణ‌లో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా.. నేడు 72 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతుంది. కాగ మంగ‌ళ వారంతో పొలిస్తే.. నేడు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. కాగ ఈ రోజు కరోనా వైర‌స్ బులిటెన్ ను కాసేప‌టి క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 72 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగ మంగ‌ళ వారం రాష్ట్రంలో కేవ‌లం 53 పాజిటివ్ కేసులే న‌మోదు అయ్యాయి.

కాగ నిన్న‌టి తో పోలిస్తే.. నేడు 19 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగాయి. కాగ నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం కేవ‌లం 637 క‌రోనా యాక్టివ్ కేసులే ఉన్నాయి. కాగ ఈ రోజ కూడా తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించలేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 22,072 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news