CPI Narayana : కాంగ్రెస్‌తో పొత్తులపై సీపీఐ నారాయణ సెటైర్..ఎంగేజ్ మెంట్ అంటూ !

-

తెలంగాణ ఎన్నికల్లో పొత్తు అంశం తేల్చకుండా కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై CPI నేత నారాయణ Xలో సెటైర్లు వేశారు. ‘నిశ్చితార్థం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి/అబ్బాయి దొరికితే మనసు మార్చుకోవడం జీవితంలో అక్కడక్కడ జరగవచ్చు ఏమో! వ్యవస్థలను కాపాడే తాజా రాజకీయాల్లోనూ ఇలా జరిగితే ఎలా?’ అని ప్రశ్నించారు. CPIకి కొత్తగూడెం, చెన్నూరు, CPMకు మిర్యాలగూడ, వైరా స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా.. పొత్తులపై నేటి మధ్యాహ్నం లోపు ఏ విషయం తేల్చాలని కాంగ్రెస్ కు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డెడ్ లైన్ విధించారు. ‘సిపిఐతో చర్చించి కుదిరితే కలిసి పోటీ చేస్తాం. లేదంటే ఒంటరిగా దిగుతాం. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. పొత్తులు కుదరకపోతే మా అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. ఇప్పటికే మా పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి’ అని వీరభద్రం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version