ఢిల్లీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. మన ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు తెప్పించిండు. దేశంలో నరేంద్ర మోడీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్లు అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.
ఎల్లుండి ఛలో కొడంగల్ కి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఇలాకాలోనే మాట్లాడుదాం.. అక్కడనే రేవంత్ రెడ్డిని అడుగుదాం. కొడంగల్ పోదాం.. వాళ్లు వచ్చి మనల్ని అడుగుడు ఏంది.. మనమే వాళ్ల దగ్గరికి పోదామురి. పోయి లగచర్ల తండా, రోటిబండ తండా ఏమైంది అని తెలుసుకుందాం. హకీంపేట ఏమైంది..? అనేది అక్కడనే మాట్లాడుదాం. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రజలు ఎవరికీ ఓట్లు వేయాలో వాళ్లే చెబుతారని పేర్కొన్నారు.