ఈటలను రెండు చోట్ల ఎమ్మెల్యే గా ఓడిస్తాం -ఈటల దళిత బాధితుల సంఘం

-

ఈటలను రెండు చోట్ల ఎమ్మెల్యే గా ఓడిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు ఈటల దళిత బాధితుల సంఘం నేతలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ మాట్లాడుతూ…ఈటల ఒక మోసగాడని ఆయన అరాచకాల పై యాభై వేల కరపత్రాలు విడుదల చేశారు. హుజురాబాద్, గజ్వేల్, నియోజకవర్గలలో ఈటల రాజేందర్ అరాచకాల పై గ్రామ గ్రామన ఈటల దళిత బాధితుల సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడుతామని హెచ్చరించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో మాలాంటి కుటుంబలను ఎంతో మందిని చంపించడం, కొట్టించడం, అక్రమ కేసులు పెట్టించడం జరిగిందన్నారు. గ్రామ గ్రామనా ఈటల రాజేందర్ బాధితులు ఉన్నారు గ్రామలకు వెళ్లితే ఈటలను చెప్పులతో కొడుతారని హెచ్చరించారు. ఈటల అక్రమ ఆస్తుల పై సిబిఐ విచారణ జరపాలని అడిగిన నాపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపించావు గుర్తు ఉందా రాజేందర్ అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రతి సారి ఎమ్మెల్యే ఎన్నికలలో మోసం మాటలు చెప్పుతూ గత ఉప ఎన్నికలలో కూడా అనేక దొంగ మాటలు చెప్పి గెలిచావు…హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడుతనని చెప్పి ఢిల్లీలో నీ రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నావు రాజేంద్ర అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version