BREAKING: మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కుత్బుల్లాపూర్ లోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ…నిరసనకు దిగారు.
ఈ తరుణంలోనే… స్థలంలో వేసిన భారీ కెడ్లను తొలగించారు మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు. ఇక విషయం తెలియగానే… పోలీసులు రంగా ప్రవేశం చేశారు. అనంతరం పోలీసులతో వాగ్వివాదం చేశారు మల్లారెడ్డి,ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఈ తరుణంలోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.