పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ సర్కార్ పాలన దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై ఫోకస్ పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం శుక్రవారం రిలీజ్ చేసింది. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం.. రేపటి నుండి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ కానుంది.
మూడేళ్లలోపు రిటైర్మెంట్ ఉన్నవారికి ప్రభుత్వం బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది. పండిట్, పీఈటీ అప్గ్రేడేషన్, మల్టీ జోన్-2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్-1 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేసింది. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ప్రక్రియ గతంలో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండే మళ్లీ ప్రాసెస్ ను మొదలుపెట్టినున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. టెట్ మార్కులతో సంబంధం లేకుండా ప్రమోషన్లు కల్పించనున్నట్లు వెల్లడించింది. మల్టీ జోన్-1లో ఈ నెల 8 నుండి 22 వరకు, మల్టీ జోన్-2 ఈ నెల 8 నుండి 30 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ
కొనసాగనుంది.