ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం

-

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు రంగం సిద్ధమైంది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

అయితే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపగా ఆమె పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆ అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా.. మరికొన్ని సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ తమిళిసై అడిగిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీలో భారత ప్రభుత్వ వాటా 30 శాతం ఉన్నందున కేంద్రం సమ్మతి పొందారా లేదా అన్న విషయమై వివరణ కోరిన గవర్నర్.. సమ్మతి పొందినట్లైతే ప్రతిని ఇవ్వాలని లేదంటే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యలను తెలపాలన్నారు. ఈ నేపథ్యంలో తమిళిసై సందేహాలకు ప్రభుత్వం సంతృప్తకర సమాధానం ఇవ్వడంతో ఆమె తాజాగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version