ప్రీతి ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళి సై సీరియస్

-

కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీకి రాజ్ భవన్ లేఖ రాసింది. ఈ లేఖలో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనపై సీరియస్‌గా స్పందించారు గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై. సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వైస్‌ ఛాన్సలర్‌కు రాజ్ భవన్ లేఖ రాసింది. “డాక్టర్ ప్రీతి మరణం భయంకరమైనది, నిజం తెలుసుకోవడానికి సాధ్యమైన అన్ని కోణాల నుండి సమగ్ర విచారణ చేయాలి.

హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీలో వేధింపులు, ర్యాగింగ్ వంటి సంఘటనలను ఎదుర్కోవటానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌పై వివరణాత్మక నివేదిక ఇవ్వాలి” అని లేఖలో పేర్కొన్నారు. మెడికోలు,అసిస్టెంట్ ప్రొఫెసర్ల డ్యూటీ అవర్స్, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులలో సిసి కెమెరాల ఏర్పాటు, పనితీరును SOP మాన్యువల్‌ల గురించి కూడా లేఖలో ఆరా తీశారు గవర్నర్. గ్రీవెన్స్ రిడ్రెస్ సెల్ పనితీరు, బాధితుల సమస్యలను పరిష్కరించడం, మెడికోల ఫీడ్‌బ్యాక్ మూల్యాంకనం, వారి పని పరిస్థితులు వంటి అంశాల పై వివరణ ఇవ్వాలని రాజ్ భవన్ లేఖ రాసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version