కాంగ్రెస్‌కు ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ : హరీశ్ రావు

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీ వైఫల్యాలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేస్తోంది. 50 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి చేసిందేం లేదని.. స్కామ్​లు చేయడం తప్ప.. సంక్షేమం ఆ పార్టీకి పట్టదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు.

సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలతో హస్తం పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ అని పేర్కొన్నారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే 10 ఏళ్లు వెనక్కి పోతామని తెలిపారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.

అంతకుముందు హరీశ్ రావు కాన్వాయ్​ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా బేగంపేట్‌ రహదారిపై  హరీశ్‌ రావు కాన్వాయ్​లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సహకరించినందుకు పోలీసులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version