పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహం

-

తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. భిన్నాభిప్రాయాలు పార్టీలో అంతర్గతంగా తెలపాలని సూచించింది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సీనియర్లపైనా చర్యలు తప్పవని పేర్కొంది. ఇటీవల కొందరు సీనియర్ నాయకులు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను మీడియా ముందుకు తీసుకెళ్తుండటాన్నిఏసీసీసీ తీవ్రంగా పరిగణించింది.

ఇటీవల లోకసభ అభ్యర్ధుల ప్రకటనపై పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ సోనియాగాంధీకి లేఖ రాయడం, రెండు రోజుల కిందట వి.హెచ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ఏఐసీసీ సీరియస్‌ అయ్యినట్లు సమాచారం. వీరిద్దరికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో మాట్లాడాలని రాష్ట్ర నాయత్వానికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరొకసారి ఇలాంటి తప్పు చేయవద్దని హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి విధేయుడుగా ఉన్న వీహెచ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version