తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే.. బతుకులు మారుతాయని అనుకున్నారు. కానీ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం.. గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 మాసాలైన గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరపడం లేదని ఎద్దేవా చేశారు. 

రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవం కాదా.. వాస్తవం అయితే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. దోచుకున్న సొత్తును రీకవరీ చేసి ఆరు గ్యారెంటీలను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలకు కేటాయించిన నిధులు సరిపోవు. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్నారు. పారదర్శకత, జవాబుదారితనం అంటే అప్పుల వివరాలను బయట పెట్టకపోవడమేనా..? అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version