అనర్హులకు పథకాలు వస్తే వాటిని గుర్తించి రద్దు చేస్తాం – మంత్రి పొంగులేటి

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలని నిర్ణయించామన్నారు. గ్రామ సభల్లో వచ్చిన వివరాల ఆధారంగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

గ్రామ సభల్లో కావాలనే కొంతమంది, కొన్ని పార్టీలు కుట్రలు పన్నారని ఆరోపించారు. కొత్త అప్లికేషన్లు క్రోడీకరించినందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి మొదటి వారంలో అర్హుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. వరి వేస్తే ఉరే అన్న పార్టీలు కూడా ఇప్పుడు రైతు కమిటీలు అంటున్నాయని మండిపడ్డారు.

ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరి పేద వారి వరకు అందేలా 606 మండలాలలో వారిని గుర్తిస్తామన్నారు. తమది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదన్నారు పొంగులేటి. తమది పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు. మంచిని చెడుగా చిత్రీకరించి ప్రజలలో మరింత పలుచన కావద్దని ప్రతిపక్షాలకు సూచించారు. అనర్హులకు పథకాలు వస్తే వాటిని గుర్తించి వెంటనే రద్దు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version