ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని యువత గురించి మాట్లాడడం విడ్డూరం – KTR

-

వరంగల్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్‌ అని.. గుజరాత్ కి రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని.. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు.

తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోడీ అని ఆరోపించారు. కేంద్రంలో 16 లక్షల ఖాళీలు భర్తీచేయకుండా, రాష్ట్రంలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన మాపై నిందలా..? అని ప్రశ్నించారు. ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని యువత గురించి మాట్లాడటం విడ్డూరం? అన్నారు.

ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా యూనివర్సిటీ ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ కి ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదన్నారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శం, దిక్సూచి అని తెలిపారు. తెలంగాణ మా కుటుంబం, రాష్ట్ర ప్రజలు మా కుటుంబ సభ్యులు, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version