తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సైరన్ !

-

సమ్మె కు సైరన్ మోగించనున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె కు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం TSRTC ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో RTC MD కి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.

rtc

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నర్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారం చెయ్యాలని.. EV బస్సుల రాకతో బస్ డిపో లు ఖాళీ చేస్తున్నారు RTC ఉద్యోగులు. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్‌ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి… ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version