తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వాక్యాలు చేశారు.
మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో కేసీఆర్ మరల సీఎం అవుతారని వాక్యానించారు. పూర్తి ఆదిక్యంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి చేసిన వాక్యాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్ట మైన మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 65 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటోంది అనే స్థాయి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయవంతంగా ప్రయాణం సాగించింది.