నిరుద్యోగులకు శుభవార్త..60 వేల ఉద్యోగాలపై కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన

-

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ ప్రభుత్వం. 60 వేల ఉద్యోగాలపై తాజాగా కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 16 లక్ష ఉద్యోగుల ఖాళీ గా ఉన్నా నింపడం లేదని.. తెలంగాణ రాష్ట్రంలో 60 వేల ఉద్యోగులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటన చేశారు.

మోటర్లకు మీటర్లు పెడితే..5 వేల కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పుతుంది..కేసీఆర్ గొంతులో ప్రాణముండగా మోటర్లకు మీటర్లు పెట్టమని చెప్పారని స్పష్టం చేశారు. మన గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేసుకొని, ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దికున్నామని.. ఇది నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.

విఠ లాపూర్ గ్రామములో 22 లక్షల్లో రైతు వేడుకను నిర్మించామని..10 వేల మెట్రిక్ టన్నుల గోదామును రూ 8 కోట్ల 30 లక్ష తో ప్రారంభించామని తెలిపారు. రూ 10 కోట్ల 35 లక్ష తో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని… 200 స్పీకర్లు సెట్స్ విఠ లాపూర్, గంగాపూర్ గ్రామాల్లో పంపిణీ చేశామని వివరించారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version