కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది – బండి సంజయ్

-

రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా? అని మండిపడ్డారు. ప్రైవేటు వర్శిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో 4 వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు బండి సంజయ్.

ప్రమోషన్లకు అమ్ముడుపోయిన కొందరు పోలీసులు ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే మీకొచ్చిన నొప్పేంటి? అని దుయ్యబట్టారు. ఏబీపీవీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా?.. తక్షణమే ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మా పార్టీ నాయకుడని… జాతీయ నాయకత్వాన్ని కలవడానికి వెళితే తప్పేంది? అని ప్రశ్నించారు. దళితులను తిట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందేనన్నారు బండి సంజయ్. అంబేద్కర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతుకయ్యేదనే సంగతి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version