కులగణనతో ఏ పథకం రద్దు కాదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం : సీఎం రేవంత్‌

-

కులగణనతో ఏ పథకం రద్దు కాదు, ఎవరి రిజర్వేషన్లు తొలగింబోమని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. కులగణనతో ఏ సంక్షేమ పథకం రద్దు కాబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందకూడదని కోరారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Key comments of CM Revanth Reddy on caste census survey

అందరూ కుల గణనకు సహకరించాలని…దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. దానికి సంక్షేమ పథకాల రద్దుకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కులగణన వల్ల  సంక్షేమ పథకాలను తొలగిస్తారని కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు రాని పథకాలు కొత్తగా వస్తాయన్నారు. ఇది ఎక్స్ రే కాదు.. మెగా హెల్త్ చెకప్ లాంటిదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  కులగణన సర్వే వల్ల 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని తెలిపారు. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే.. కులగణన సర్వే చేపడుతున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version