ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు !

-

ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని..ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ బూత్ అధ్యక్షులు అ పై స్థాయి నాయకుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిధ్దం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోసం సందేశం ఇవ్వడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మనోహర్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంటుకు వచ్చారు….వచ్చే పార్లమెంటు ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఎన్నికలు కావు… దేశ ప్రజలకు చాలా ప్రతిష్టాత్మకమైనవన్నారు.

BJP Telangana State President Kishan Reddy visited Bhagyalakshmi Ammavari in Hyderabad

దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపచేయడం కోసం జరిగే ఎన్నికలు అని.. దేశంలో అవినీతి మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు… దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. దేశంలో మరోమారు భారతీయ జనతా పార్టీ గెలిచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది….నరేంద్ర మోదీ సమర్థవంతంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించి అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version