వాల్మీకి స్కాం డైవర్షన్ కోసమే హైడ్రా హైడ్రామా అంటూ సంచలన వీడియో రిలీజ్ చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. రూ. 187 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ నిధులు కాంగ్రెస్ నాయకులు తిన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. వాల్మీకి స్కాంలో V6 సంస్థ ఓనర్ వివేక్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు KTR. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు చేశారు.
సీఎం సిద్దరామయ్య డైరెక్టుగా ఇరుక్కున్న ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ రూ. 187 కోట్ల నిధుల తరలింపు కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలోకి రూ. 45 కోట్ల నిధుల తరలింపు జరిగినట్లు పేర్కొన్నారు. V6 బిజినెస్ సొల్యూషన్స్ పేరిట ఉన్న కంపెనీలోకి రూ. 4.5 కోట్లు తరలించారని చెప్పారు కేటీఆర్.
సిద్దరామయ్యను సీఎం పదవి నుండి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిళ్లు.. సిద్దరామయ్యను మారిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా మార్చాలంటూ కర్ణాటక మంత్రి సతీష్ జర్కిహోలి కీలక వాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేటీఆర్. ఈ స్కాం మీద మీడియాలో చర్చ జరగకుండా ఎన్ కన్వెన్షన్ మీద “హైడ్రా పేరిట దాడులు అంటూ హైడ్రామా” అంటూ సంచలన వీడియో రిలీజ్ చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.