మాది నిర్మాణం.. కాంగ్రెస్ ది విధ్వంసం.. మూసి కూల్చివేతలపై కేటీఆర్ సీరియస్

-

మూసి కూల్చివేతలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. మేము నిర్మిస్తే – మీరు కూల్చేస్తున్నారు… మాది నిర్మాణం – మీది విధ్వంసం అంటూ ఫైర్ ఆయాయ్రు కేటీఆర్. లక్షల నిర్మాణాలు మావి – లక్షల కూల్చివేతలు మీవి అని ఆగ్రహించారు. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అన్నారు.

KTR slams Telangana government

కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే అంటూ మండిపడ్డారు. కట్టలేదన్నారు-ప్రజలను మభ్యపెట్టాం అన్నారు-మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి నాయుడు అంటూ సెటైర్లు పేల్చారు.

మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా ? కేసీఆర్ నిజం, అయన హామీలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా ? అని ప్రశ్నించారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్ కు ఇవ్వాళా కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయి… కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజమన్నారు. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version