రూ.లక్ష సహాయానికి నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

-

తెలంగాణలో బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఈ సాయానికి అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు సకాలంలో అందకపోవడంతో సహాయానికి దరఖాస్తు చేసుకోవడమూ సాధ్యం కావడంలేదు. దీంతో చాలాచోట్ల పేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పథకానికి నేటితో దరఖాస్తు గడువు ముగియనుండడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇప్పటికే రూ.లక్ష ఆర్థిక సహాయ పథకానికి దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఎంబీసీలతో పాటు 14 కులాలకు చెందిన కుటుంబాలు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. దీనికి ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అవసరం. కానీ చాలామందికి సకాలంలో అందడం లేదు. ఈ విషయంలో తక్షణ చర్యలు ఉండాలని, పత్రాలను వెంటనే మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం సూచించినా, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ ఉండడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version