మేము రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టం… పడిపోతే కాపాడలేం – బీజేపీ నేత లక్ష్మణ్

-

మేము రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టం… పడిపోతే కాపాడలేం అంటూ బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ముందు నీ ఎమ్మెల్యేలను కాపాడుకో.. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టం. ప్రభుత్వం పడిపోతే కాపాడలేమని హెచ్చరించారు బీజేపీ నేత లక్ష్మణ్. ఇవాళ జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ జరిగింది.

laxman again controversol comments on revanth

ప్రధాని నరేంద్ర మోడీ..ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటలు చెప్పడంలో కేసీఆర్ ను రేవంత్ మించి పోయాడని ఆగ్రహించారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు జరుగుతున్నాయి అంటున్నాడు రేవంత్… మీ ప్రభుత్వాన్ని మేమేమి కూలగొట్టబోమని తెలిపారు. ఎవరైనా కూలగొడితే మేము కాపాడలేమని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version