పవర్​స్టార్ మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్​కమ్.. వీడియో చూస్తే గూస్​బంప్స్ గ్యారెంటీ

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్​కమ్ ఇచ్చింది. పవర్ స్టార్ తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు హైదరాబాద్​లోని ఆయన నివాసానికి వెళ్లారు. దిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్​ వచ్చిన పవన్, భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలతో కలిసి నేరుగా చిరు నివాసానికి వెళ్లగా ఆయనకు ఘనస్వాగతం లభించింది.

తల్లి అంజనా దేవి వారికి గుమ్మడి కాయతో దిష్టి తీయగా, పవన్​ అక్కాచెల్లెల్లు, వదినలు నీరాజనాలు ఇస్తూ లోపలికి ఆహ్వానించారు. ఈ విజయోత్సవంలో భాగం అయ్యేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ చిరు ఇంటికి చేరుకున్నారు. అన్నయ్య చిరంజీవి రాగానే నేరుగా ఆయన కాళ్లకు నమస్కారం చేయగా, పవన్​ను పైకి లేపి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు చిరు. ఆ తర్వాత తన తల్లి అంజనాదేవి, వదిన సురేఖల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ‘కల్యాణ్‌ బాబు హ్యాట్సాఫ్‌’ అని రాసి ఉన్న కేక్‌ను కట్‌ చేసి పవన్‌ తన కుటుంబసభ్యులకు తినిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో దృశ్యాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే గూస్​బంప్స్ గ్యారెంటీ. మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version