Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అర్హత లేని వారి రేషన్ కార్డులు, పెన్షన్లు తొలగిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో కేవలం పేద కుటుంబాలకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
వచ్చే నెల నుంచి రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. హామీ ఇచ్చినట్లుగా రూ.31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పేదలకు ఇచ్చిన హామీల అమలుపై వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.