ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉదయం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని.. వినాయక సాగర్ చుట్టూ 131 క్రేన్ లు ఏర్పాటు చేసామన్నారు. GHMC పరిధిలో మరిన్ని క్రేన్ లు ఏర్పాటు చేసామని.. శివారు ప్రాంతాల్లో లేక్ లు, మిని పాండ్స్ లో వినాయకుల నిమజ్జనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వినాయక సాగర్ లో ఉత్సవ కమిటీ లకు విజ్ఞప్తి… త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చెయ్యాలని…కోరుతున్నామని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఉదయాన్నే ప్రారంభం అవుతుందని… 70 ఏళ్ల అనుభవం ఉత్సవ కమిటీ కి ఉంది…కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. వినాయక సాగర్ వైపు వచ్చే నిమజ్జన వాహనాలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులూ వచ్చినా కూడా వారికి సహాయం అందించేందుకు మా అలెర్ట్ టీం లు సిద్ధంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం తరఫున నిరంతర పర్యవేక్షణ ఉంటుంది… సాఫీగా నిమజ్జనం పూర్తి చేస్తామని ప్రకటించారు.