నేడు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను సందర్శించనున్న మంత్రుల బృందం

-

నేడు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించనుంది. మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యారేజీలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా వారు కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించనున్నారు. మొదట కాళేశ్వరంపై నీటిపారుదల శాఖ అధికారులు మంత్రులకు పీపీటీ ఇవ్వనున్నారు. అనంతరం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సమస్యలు, పరిష్కారాలపై ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష తర్వాత అన్నారం ఆనకట్టను పరిశీలిస్తారు.

అన్నీ క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం మేడిగడ్డ, అన్నారం ఆనకట్టల సమస్యలు, పరిష్కారంతో పాటు ప్రాణహిత – చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వల్ల కలిగిన లాభనష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వివరించనుంది. మేడిగడ్డ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతో పాటు ప్రాణహిత ప్రాజెక్టు విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణతో పాటు ప్రాణహిత ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రులు స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడిగడ్డ అనంతరం అన్నారం ఆనకట్టను కూడా మంత్రులు సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version