రూ.1000 కోట్ల పరువు నష్టం దావాపై స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

-

సిద్దిపేట: దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్బి సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఐఆర్బి సంస్థ రఘునందన్ రావుకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు ను హెచ్ఎండిఏ సంస్థ ఐఆర్బి సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని రఘునందన్ రావు ఆరోపించారు. ఆయన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఆర్బి పరువు నష్టందావా వేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.

అయితే తాజాగా పరువు నష్టం దావాపై స్పందించారు రఘునందన్ రావు. తనకి నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయని.. కానీ ఆ నోటీసులు ఇంకా తనకు అందలేదని అన్నారు. రూ.1000 కాకపోతే 10 వేల కోట్ల దావా వేసుకోమని అన్నారు ఎమ్మెల్యే. తాను నోటీసులకు బయపడేవాడిని కాదని.. నోటీసు వస్తే రిప్లై ఇస్తానన్నారు. తెలంగిణకి జరుగుతున్న అన్యాయంపై మళ్ళీ మాట్లాడుతానని స్పష్టం చేశారు. తాను ఓ వకిల్ ని అని.. తెలంగాణకి అన్యాయం జరిగితే రఘునందన్ ప్రశ్నించే గొంతుక అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version