జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. చైర్పర్సన్ మాటలు బాధించాయని..చైర్ పర్సన్ మాటల వెనుక ఎదో అదృశ్య శక్తి వ్యక్తులు ఉన్నారని తెలిపారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చైర్ పర్సన్ అనడం సరికాదు..మున్సిపల్ చైర్మన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.
చైర్ పర్సన్ శ్రావణి వ్యాఖ్యలు బాధ, ఆశ్చర్యం కలిగించాయని..సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతాం అని కౌన్సిలర్ లు చెప్పినా వద్దని చెప్పామన్నారు. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్ పర్సన్ కు కాల్ చేశామని..ఈ లోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు చేయడం బాధించాయని వెల్లడించారు. నిరాధార ఆరోపణలపై స్పందించనని..కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్ లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. కౌన్సిలర్ లను ఎలాంటి క్యాంప్ లకు పంపలేదు. కౌన్సిలర్ లనే అడగండి.. 50% బిసి మహిళలకు పదవులు ఇచ్చామని వెల్లడించారు.