సీఎం రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు అనేక ఆరోపణలు చేస్తున్నారు. సభను సీఎం డైవర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. కానీ అసలు BRS పార్టీ పుట్టిందే అబద్దాల మీద అని ఎమ్మెల్యే విజయరమణ రావు పేర్కొన్నారు. విద్యుత్ మీద చర్చ జరిగే సమయంలో.. సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడతామని కేంద్రంతో కేసిఆర్ ఒప్పందం చేసుకున్నారు. అన్నారం,సుందిల్లా,మేడిగడ్డ లలో బుంగాలు ఏర్పడి..పగుళ్లు వస్తె సందర్శనకు ఎవ్వరినీ వెళ్లనివ్వలేదు. నీళ్ళు నిల్వ చేస్తే.. ప్రమాదమని NDSA చెబితే.. గేట్లు తెరిచిపెట్టాం.
కేటీఆర్ మేడిగడ్డ పీక్నిక్ కి వెళ్లివచ్చాడు. హరీష్ రావుకు సోయి ఉండాలి.. తల ఎక్కడ పెట్టుకుంటావు. మూడు బ్యారేజీలు నిర్మాణం చేసిన సమయాల్లో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు అని గుర్తు చేసారు. పగుళ్ళకు కాంగ్రెస్ నాయకులు కారణం అని కేటీఆర్ అంటున్నాడు. కానీ మేము ఎల్లంపల్లి నుంచి మిడ్ మనేర్.. మల్లన్న సాగర్ లా ద్వారా చివరి ఆయకట్టు కు నీళ్ళు అందిస్తాం అని ఎమ్మెల్యే విజయరమణ రావు పేర్కొన్నారు..