మెట్రో రైలు యాజమాన్యం ప్రయానికులకు షాక్ ఇచ్చింది. కమర్షియల్ గా మారుతున్నది హైదరాబాద్ మెట్రో. నాగోల్ మెట్రో లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు. ఇక ఫ్రీ పార్కింగ్ తొలగించడంతో మెట్రో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. గతంలో పూర్తిగా ఫ్రీగా పార్కింగ్.. ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు.
బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే 10 రూపాయలు. 8 గంటల వరకు పార్క్ చేస్తే 25 రూపాయలు. 12 గంటల వరకు వాహనం పార్కింగ్ చేస్తే 40రూపాయలు కట్టాలి. అలాగే కార్లకు 2 గంటల వరకు పార్క్ చేస్తే 30 రూపాయలు. 8 గంటల వరకు పార్క్ 75 రూపాయలు. 12 గంటల వరకు పార్క్ చేస్తే 120రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. గతం లో టాయిలెట్ లు కూడా ఉచితంగా ఉండేది. తరువాత వాటికి కూడా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పార్కింగ్ కి డబ్బులు కట్టినా కూడా పార్కింగ్ at ఓనర్స్ రిస్క్ అని బోర్డు పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.